: దాడి జరిగిందా?... అత్యాచార యత్నమా?: వైసీపీ మహిళా నేత ఇంటిలో గాయాలతో పడి ఉన్న జడ్పీటీసీ!


ఓ వైపు ఏపీ రాష్ట్ర కార్యాలయాలన్నీ తరలివచ్చిన క్రమంలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కేంద్రంగా మారిన గుంటూరు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాదు నుంచి బస్సుల్లో మూకుమ్మడిగా తరలివస్తున్న ఉద్యోగులకు స్థానికులు సాదర స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో ఆ జిల్లాలో జరిగిన ఓ ఘటన పెను కలకలమే రేపుతోంది. గుంటూరు జిల్లా పరిషత్ లో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్న ఆ పార్టీ మహిళా నేత ఇంటిలో ఓ జడ్పీటీసీ గాయాలతో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వెనువెంటనే పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన వైసీపీ మహిళా నేత తనపై అత్యాచార యత్నం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రక్తమోడుతున్న గాయాలతో ఆసుపత్రి బెడ్ పైకి చేరిన జడ్సీటీసీ మాత్రం డబ్బు అడిగేందుకు వెళ్లిన తనపై దాడి చేశారని వాపోయాడు. ఎవరి వాదన నిజమో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మణిపురం గ్రామంలోని వైసీపీ మహిళా నేత రేవతి ఇంటిలో చోటుచేసుకుంది. గాయపడ్డ జడ్పీటీసీని అదే జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడుకు చెందిన వీరనారాయణగా పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News