: చిత్తూరు జిల్లా నగరిలో దారుణం.. నాలుగు నెలల చిన్నారి సహా తల్లి హత్య
చిత్తూరు జిల్లా నగరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారితో పాటు హత్యకు గురయింది. తల్లీబిడ్డలు హత్యకు గురి కావడం పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులు నేపాల్ వాసులుగా గుర్తించారు. హత్యకు గురైన మహిళ భర్త భానుప్రకాశ్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు. భానుప్రకాశ్‌ని అదుపులోకి తీసుకొని పోలీసులు పలు విషయాలపై ఆరా తీస్తున్నారు. భానుప్రకాశ్ నగరిలో గూర్ఖాగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.