: తిరుపతి కేబీ లేఅవుట్‌లో ప్రేమోన్మాదుల ఘాతుకం.. గాయాలతో మంచానికే పరిమితమైన విద్యార్థిని
తిరుపతి కేబీ లేఅవుట్‌లో ఇద్దరు యువకులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రేమ పేరుతో నవీన్, యశ్వంత్ అనే యువకులు సహ విద్యార్థినిని వేధించారు. విద్యార్థిని చంద్రిక స్కూటీపై వెళుతుండగా తమ బైక్‌తో ఢీ కొట్టారు. ప్రేమోన్మాదుల చర్యతో చంద్రిక తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయింది. ఆమె వెన్నెముక దెబ్బతిన్నట్లు డాక్టర్లు తెలిపారు. యువకుల ఘాతుకంపై చంద్రిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రేమోన్మాదులపై గతంలోనే పోలీసులకి ఫిర్యాదు చేశామని, దీనిపై వారు నిర్లక్ష్యం వహించారని సకాలంలో స్పందించలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటన పట్ల మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.