: నా పోస్టర్ ను కాపీ కొట్టిన రజనీకాంత్: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ విమర్శ
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సౌతిండియా మెగాస్టార్ రజనీకాంత్ పై సంచలన విమర్శలు చేశారు. కబాలీ సినిమా కోసం తన తాజా చిత్రం 'మదారీ' కోసం తయారు చేయించుకున్న పోస్టర్లను కాపీ కొట్టారని విమర్శించారు. అపై ఇదేమంత పెద్ద విషయమేమీ కాదని, చిత్ర అభిమానులు రెండు సినిమాలకూ వెళ్లాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ముంబైలో జరిగిన చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తాము ఓ చిన్న చిత్రాన్ని నిర్మించామని, తమ పోస్టరును, రజనీ హీరోగా తయారైన కబాలీ చిత్ర పోస్టరును చూపిన ఆయన, రెండింటి పోలికలు తెలిపారు. కాగా, మదారీ చిత్రం పోస్టర్ అధికారికంగా విడుదలైన పోస్టర్ అని, కబాలీ పోస్టర్ ఎవరో అభిమాని తయారు చేసి ఆన్ లైన్ లో పెట్టినదే తప్ప, అధికారికంగా నిర్మాతలు విడుదల చేసింది కాదని రజనీ అభిమానులు వ్యాఖ్యానించారు. ఆ రెండు పోస్టర్లనూ ఇక్కడ మీరు చూడవచ్చు.