: థానేలో భారీ చోరీ... ‘ఎటీఎం క్యాష్’ వ్యాన్ పై దాడి చేసి రూ.12 కోట్లు కొల్లగొట్టిన దొంగలు


మహారాష్ట్రలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. ఆ రాష్ట్రంలోని థానేలో నేటి ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏకంగా రూ.12 కోట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. పక్కాగా స్కెచ్ వేసుకున్న దోపిడీ దొంగలు... ఏటీఎంలలో నగదును పెట్టేందుకు బయలుదేరిన వ్యాన్ పై మెరుపు దాడి చేశారు. వ్యాన్ లోని బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు తేరుకునేలోగానే వ్యాన్ లోని రూ.12 కోట్ల నగదుతో దొంగలు పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దోపిడీ దొంగల కోసం గాలింపు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News