: 'కబాలీ'... రా అంటున్న ఎయిర్ ఆసియా!


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే, దానిపై అభిమానులు చూపే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని భావించే సంస్థలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు తాజాగా విమానయాన సంస్థ ఎయిర్ ఆసియా కబాలీ చిత్రం విడుదల సందర్భంగా 'ఫ్లయ్ లైక్ ఏ సూపర్ స్టార్' పేరిట ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా, బెంగళూరు నుంచి కోచి, గోవాలకు రూ. 786, విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రూ. 1,786 (అన్ని పన్నులు కలుపుకొని)కే ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఇక ఇంటర్నేషనల్ రూట్లలో ఓ వైపు ప్రయాణానికి రూ. 2,999కి టికెట్లను కొనుగోలు చేయవచ్చని, వచ్చే నెల 3లోగా టికెట్లు బుక్ చేసుకుని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణం చేయాల్సి వుంటుందని తెలియజేసింది.

  • Loading...

More Telugu News