: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వాన!... హైదరాబాదులో ఎడతెరిపి ఇవ్వని వరుణుడు!


నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంది. ఏపీలోని ఉత్తర కోస్తాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా పోటెత్తిన వరద ప్రభావానికి రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. రాయలసీమ, తెలంగాణల్లోని పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాదులో నిన్న సాయంత్రం నుంచి మొదలైన వర్షం నేడు తెల్లవారినా ఏమాత్రం ఆగలేదు. ఎగతెరిపి లేని వర్షంతో నగర జీవనం స్తంభించింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన వర్షపు నీరు... ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించింది.

  • Loading...

More Telugu News