: సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం బాగానే ఉంది: సోదరుడు సత్యనారాయణ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం బాగుండలేదంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య పరీక్షల నిమిత్తమే ఆయన అమెరికా వెళ్లారని రజనీ సోదరుడు సత్యనారాయణ వెల్లడించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ‘కబాలి’ సినిమా రిలీజ్ సమయానికి ఆయన చెన్నైకి వస్తారని చెప్పారు. రజనీ ఆరోగ్యం గురించి తల్లడిల్లుతున్న ఆయన అభిమానులందరికీ తమ కుటుంబం రుణపడి ఉంటుందని అన్నారు.