: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్ లో ఈరోజు రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, పార్శిగుట్ట, చిలకలగూడ, బేగంపేట, బోయిన్ పల్లి, అడ్డగుట్ట, తిరుమలగిరిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.