: తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ లకు బదిలీలు జరిగాయి. సైబరాబాద్ వెస్ట్ సీపీగా నవీన్ చంద్, వెస్ట్ జాయింట్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ ఈస్ట్ సీపీగా మహేష్ భగవత్, ఈస్ట్ జాయింట్ సీపీగా శశిధర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్ గా ఎంకే సింగ్, శాంతి భద్రతల డీఐజీగా కల్పనా నాయక్, హైదరాబాద్ అడిషినల్ సీపీ(శాంతి భద్రతలు)గా వీవీ శ్రీనివాసరావు, ఐజీ (పర్సనల్) సందీప్ శాండిల్యను బదిలీ చేశారు. కాగా, ప్రస్తుత సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సెలవుపై వెళ్లనున్నారు.