: కేసీఆర్.. టీడీపీయేం బీరు సీసా కాదు, ఖాళీ అవడానికి: రేవంత్ కౌంటర్


మే నెల నాటికి టీడీపీ ఖాళీ అవుతుందని కేసీఆర్ టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో వ్యాఖ్యానించడం పట్ల టీడీపీ నేత రేవంత్ రెడ్డి దీటుగా బదులిచ్చారు. ఖాళీ అవడానికి తెలుగుదేశం పార్టీ బీరు సీసానో, విస్కీ సీసానో కాదని కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. బాబు పాదయాత్ర ముగింపు సభలో రేవంత్ మాట్లాడుతూ, కేసీఆర్ పార్టీని ఫామ్ హౌస్ పార్టీ అని పేర్కొన్నారు.

పాములవాడు నాగుల చవితి రోజున బుట్టలోంచి పామును తీసి డబ్బులు, పండ్లు దండుకుంటాడని.. అలాంటి పాములోడి లాగానే కేసీఆర్ కూడా కావాలనుకున్నప్పుడల్లా ఉద్యమాన్ని బయటకితీసి కోట్లు, పదవులు, సీట్లు కొల్లగొడతాడని ఎద్దేవా చేశారు. ఇక జగన్ సోదరి షర్మిలపైనా రేవంత్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగనన్న వస్తే ప్రజల కష్టాలు తీరతాయని చెబుతున్న షర్మిల.. జగన్ ఎందుకు జైలుకు వెళ్ళాడో చెప్పాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News