: వర్షం కోసం మోకాలి లోతు నీటిలో నృత్యం
వర్షాలు కురవాలని కోరుకుంటూ పదిహేనేళ్ల బాలిక ఏకధాటిగా 8 గంటల పాటు మోకాలి లోతు నీటిలో నృత్యం చేసింది. నీరు లేక ఇబ్బందిపడుతున్న బుందేల్ ఖండ్ రైతుల కోసం లఖ్ నవూకి చెందిన అంకిత బాజ్ పాయ్ ఈ నృత్యం చేసింది. ఈతకొలనులో మోకాలి లోతు నీటిలో ఐదు గంటల పాటు నృత్యం చెయ్యాలని తొలుత అనుకుంది. కానీ, అక్కడి ప్రజలు ఆమెను ప్రోత్సహించడంతో మరింత ఉత్సాహం పొందిన అంకిత ఎనిమిది గంటల పాటు నృత్యం చేసింది. ఈ సందర్భంగా అంకిత మాట్లాడుతూ, నీళ్లలో నృత్యం చేస్తుంటే బాగుందని, కాకపోతే చాలా శక్తి కావాలని చెప్పింది. నీళ్లలో ఈవిధంగా నృత్యం చేసేందుకు రోజుకు మూడు లేదా నాలుగు గంటలపాటు ప్రాక్టీస్ చేసేదాన్నని అంకిత పేర్కొంది. కాగా, గతంలో ఐదు గంటల పాటు కుండపై కథక్ నృత్యం చేసిన అంకిత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.