: సినీ పాటల పరిశోధకుడు రాజాకు ‘గ్లోబల్ పీస్’ డాక్టరేట్
చాలా ఏళ్లుగా సినిమా పాటలపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్ కు చెందిన మ్యూజికాలజిస్ట్ రాజాను అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ సంస్థ డాక్టరేట్ తో సన్మానించింది. తెలుగు సినీ సంగీతానికి తన వ్యాసాలు, రివ్యూలు, పరిశోధనలు, విశ్లేషణలను అందించిన ఆయన సేవలకు గుర్తుగా బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో డాక్టరేట్ ను అందజేసింది. అంతర్జాతీయంగా 77 దేశాలలో గుర్తింపు కలిగిన గ్లోబల్ పీస్ సంస్థ తనకు ఈ డాక్టరేట్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రాజా చెప్పారు. కాగా, నలభై ఏళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషలకు చెందిన నలభై వేలకు పైగా పాటల సమాచారాన్ని రాజా తన వెబ్ సైట్ లో పొందుపరిచారు.