: విదేశాల్లో బిక్షగాడిలా అడుక్కుంటే పెట్టుబడులు రావు: అంబటి
ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో బిక్షగాడిలా అడుక్కుంటే పెట్టుబడులు రావని వ్యాఖ్యానించారు. రెండేళ్ల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క రూపాయి అయినా పెట్టుబడి వచ్చిందా..? అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. హోదా సాధిస్తే పెట్టుబడులు వాటంతటవే వచ్చేస్తాయని అన్నారు. విదేశీ మోజులో స్వదేశీ పారిశ్రామికవేత్తలను కించపరుస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ప్రత్యేక విమానాల్లో తరలుతోన్న సూట్ కేసుల్లో ఏమున్నాయి..? అని ఆయన ప్రశ్నించారు.