: వనస్థలిపురంలో స్కూల్ ముందు ఆడుకుంటూ ఎల్‌కేజీ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ చిన్నారి అదృశ్యమయిన ఘటన కలకలం రేపుతోంది. వనస్థలిపురంలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోన్న అయాన్ అనే చిన్నారి ఈరోజు మధ్యాహ్నం స్కూలు వద్ద ఆడుకుంటూ గేటు బయటకు వెళ్లాడు. మళ్లీ లోపలికి రాలేదు. తమ కుమారుడి గురించి తల్లిదండ్రులు అడిగే వరకు స్కూలు యాజమాన్యం గమనించకపోవడం గమనార్హం. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పాఠశాలలోని సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని వెతుకుతున్నారు. తమ చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.