: గూగుల్ సీఈఓ భద్రత బలహీనంగా ఉంది... ఆయన అకౌంటును మేమే హ్యాక్ చేశాం!: 'అవర్ మైన్' హ్యాకర్స్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కోరా అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆయన కోరా అకౌంట్ లో పోస్ట్ చేసిన విషయాలను తీసుకెళ్లి పిచాయ్ ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు పోస్ట్ చేశారు. హ్యాకింగ్ పని తమదేనంటూ 'అవర్ మైన్' బృందం వారి వెబ్ సైట్ లో పేర్కొంది. ఈ పని చేసిన హ్యాకర్లు గూగుల్ సీఈవో భద్రత మరీ బలహీనంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ట్విట్టర్ ఖాతాను కూడా అవర్ మైన్ హ్యాకింగ్ గ్రూపు గతంలో హ్యాక్ చేసింది.