: వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో కొలువుదీరే తొలి శాఖలివే!


నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయానికి మొట్టమొదటగా తరలే శాఖల వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వెలగపూడికి వెళ్లే శాఖలపై చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ కొద్దిసేపటి క్రితం అధికారులతో సమీక్షించారు. 29న మధ్యాహ్నం 2:59కి వివిధ శాఖలను ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించినట్టు తెలిపారు. తొలి దశలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రోడ్లు, భవనాలు, కార్మిక, ఉపాధి, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు వెలగపూడికి వస్తాయని వివరించారు. ఐదో భవనం కింది అంతస్తులో ఈ శాఖలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తదుపరి భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత మరిన్ని శాఖలు వస్తాయని తెలిపారు.

  • Loading...

More Telugu News