: కుప్పంలో సైకో సూదిగాళ్ల అలజడి.. నలుగురు మహిళలకు మత్తు ఇంజక్షన్లు
సైకో సూదిగాళ్లు మహిళలకు మత్తుమందు కలిపిన ఇంజక్షన్‌ను ఇచ్చిన ఘటన చిత్తూరులోని కుప్పంలో కలకలం రేపింది. అక్కడి ఎన్టీఆర్ కాలనీలో మహిళలను టార్గెట్‌గా చేసుకున్న సైకో సూదిగాళ్లు ఇళ్లలోకి ప్రవేశించి, రక్తపరీక్షలు చేయడానికి వచ్చామని చెప్పారు. మత్తుమందు కలిపిన ఇంజక్షన్‌ను నలుగురు మహిళలకు చేశారు. దుండగులు ఇచ్చిన ఇంజక్షన్‌తో మహిళలు స్పృహ కోల్పోయారు. స్థానికులు పరిస్థితిని అర్థం చేసుకుని దుండగుల్లో ఒకరిని పట్టుకుని చితగ్గొట్టారు. మరో దుండగుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. స్థానికులు ఈ అంశంపై పోలీసులకి ఫిర్యాదు చేయడంతో, దొరికిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కర్ణాటకలోని బంగారు పేటకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాధిత మహిళలను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.