: ఛత్తీస్ గఢ్ ట్రైబల్ విద్యార్థుల ఐఐటీ విజయాలు


ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో సీటు కొట్టాలనేది ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థుల కలగా చెప్పవచ్చు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్ గఢ్ కు చెందిన ట్రైబల్ విద్యార్థులు ఆ కలను సాకారం చేసుకున్నారు... అటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో సీట్లు సంపాదించారు. ఆ రాష్ట్రం నుంచి ఒకరో ఇద్దరో కాదు సీట్లు సంపాదించింది, ఏకంగా 27 మంది విద్యార్థులు ఈ ఏడాది నిర్వహించిన ఐఐటీ ఎంట్రన్స్ లో విజయం సాధించారు. 2012, 2015 సంవత్సరాల మధ్య కాలంలో కేవలం 9 మంది విద్యార్థులు మాత్రమే ఐఐటీ ఎంట్రన్స్ పాసై ఇంజనీరింగ్ సీట్లు సంపాదించారు. ఈ యేడు మాత్రం ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగింది. అంతేకాదు, మరో 150 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ఐఐటీ ఎంట్రన్స్ లో విజయం సాధించిన 27 మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను అక్కడి ప్రభుత్వం అందజేసింది. అంతేకాకుండా, వారి చదువు నిమిత్తం వడ్డీరహిత రుణాన్ని కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చింది. కాగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్ గఢ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ప్రయాస్’ అనే రెసిడెన్షియల్ పాఠశాలలను 2010 లో ప్రారంభించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, ట్రైబల్ జిల్లాల్లో పదవ తరగతి వరకు ప్రతిభ కనబరిన విద్యార్థులను ఎంపిక చేసి కాంపిటీటివ్ పరీక్షల నిమిత్తం ప్రత్యేక శిక్షణ ఇస్తుంటుంది. ఈ సందర్భంగా ఐఐటీ ర్యాంకు హోల్డర్ అయిన పద్దెనిమిది సంవత్సరాల సోది దేవా అనే యువకుడు మాట్లాడుతూ, "రెండేళ్ల క్రితం మా కుటుంబం నుంచి ఒకరిని మావోయిస్టులలో కలవాలంటూ మావోలు అడిగారు. అందుకు ఇంటిపెద్దలు అంగీకరించకపోవడంతో సుకుమా జిల్లాలోని మా ఇంటిని మావోయిస్టులు ధ్వంసం చేశారు. మళ్లీ వాళ్ల దృష్టిలో పడకుండా ఉండాలనుకున్నాము. అందుకే, నేను ప్రయాస్ పాఠశాలలో చేరి ర్యాంకు సాధించాను" అని చెప్పాడు.

  • Loading...

More Telugu News