: తెలంగాణ వ్యాప్తంగా 9,335 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి కేసీఆర్ ఆదేశం
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో, తెలంగాణ వ్యాప్తంగా 9,335 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కలెక్టర్ల ద్వారా తాత్కాలిక పద్ధతితో విద్యావాలంటీర్ల ఎంపిక జరగాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ అయ్యే వరకు విద్యా వాలంటీర్లను కొనసాగించాలని చెప్పారు. విద్యా వాలంటీర్ల నియామకంతో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.