: న్యాయాధికారుల తొలగింపును నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన
హైదరాబాద్‌లో నిన్న న్యాయాధికారులు చేసిన ఆందోళన పట్ల ఆగ్రహించిన హైకోర్టు ఇద్దరు న్యాయాధికారులను ఈరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ వరప్రసాద్‌ను విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఈరోజు ఆందోళనకు దిగారు. హైకోర్టు, నాంపల్లి కోర్టుల వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. న్యాయవాదులు ఆందోళన చేస్తోన్న కోర్టుల ప్రాంగణాల్లో పోలీసు బలగాలు మోహరించాయి.