: ఇక చాలు... నోటికి తాళం వెయ్యి: స్వామికి బీజేపీ అధినేతల వార్నింగ్
సొంత పార్టీ నేతలు, వారి నిర్ణయాలపై వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ అధిష్ఠానానికి తలవంపులు తెస్తున్న సుబ్రహ్మణ్య స్వామికి పార్టీ సీనియర్ల నుంచి సీరియస్ వార్నింగ్ వెళ్లింది. ఆయనిక తన నోటికి తాళం వేయాలని హెచ్చరించినట్టు పార్టీ వర్గాలు నేడు వెల్లడించాయి. గత రాత్రి చైనా పర్యటన నుంచి వచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు. వీరిద్దరి కలయిక సారాంశం వెల్లడి కాకున్నా, ఆ వెంటనే రెండు నెలల క్రితం రాజ్యసభకు ఎంపికైన స్వామికి హెచ్చరికలు వెళ్లాయి. గత కొంత కాలంగా ఆయన నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత రఘురాం రాజన్ ను, ఆపై అరవింద్ సుబ్రమణియన్ ను ఆయన లక్ష్యంగా చేసుకోగా, అవి పరోక్షంగా ఆర్థిక మంత్రి జైట్లీపై గురి పెట్టినట్టు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వామిని బీజేపీ నేతలు హెచ్చరించినట్టు తెలుస్తోంది.