: దెయ్యం సినిమా చూసి భయపడుతున్న కుక్క... పూరీ షేర్ చేసిన వీడియో వైరల్


వెండితెరపై హల్ చేస్తున్న లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం 'ది కంజ్యూరింగ్ -2' సినీ అభిమానులను మాత్రమే కాదు, జంతువులను సైతం భయపెడుతోంది. మామూలుగా దెయ్యాలను శునకాలు గుర్తిస్తాయని, అవి కనిపిస్తే మొరుగుతూ వాటి వెంట పడతాయని ఆనోటా, ఈనోటా విన్నాం. కానీ, దెయ్యం సినిమాలు చూస్తూ కుక్కలు భయపడతాయని నిరూపిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇంట్లో టీవీలో 'ది కంజ్యూరింగ్ -2' వస్తుంటే, ఆ భయంకర దృశ్యాలను చూస్తున్న ఓ కుక్క, భయంతో సోఫా చాటుకెళ్లి నక్కి మరీ టీవీని ఆసక్తిగా చూస్తుండటాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్లో పెట్టాడు. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ఇది తెగ నచ్చేయడంతో, తన ఖాతా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

  • Loading...

More Telugu News