: వచ్చే నెలలో గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటన


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 1,2 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల విషయమై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సమావేశం నిర్వహించారు. వీఆర్ పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ, జులై 1న పశ్చిమగోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో జగన్ పర్యటించనున్నారని, పోలవరం ముంపు ప్రాంతాల్లోని ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారన్నారు. 2వ తేదీన ఎటపాక మండలం మీదుగా కూనవరం చేరుకుంటారని, రేఖపల్లిలో నిర్వాసిత రైతులతో మాట్లాడనున్నారని చెప్పారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగసభలో జగన్ పాల్గొననున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News