: హైదరాబాద్ నుంచి గుంటూరుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు
హైదరాబాద్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపులో భాగంగా మరికొన్నింటిని గుంటూరుకు తరలించారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన శాఖ కమిషనరేట్లను గుంటూరు మార్కెట్ యార్డులో, సహకార శాఖ కార్యాలయాన్ని శ్యామలానగర్ లో, మున్సిపల్ శాఖ కార్యాలయాన్ని గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో, ఎన్జీరంగా వర్శిటీ కార్యాలయాన్ని గుంటూరు అగతవరప్పాడులో, ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయాన్ని గుంటూరు కంకరగుంట గేటు వద్దకు, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని కలెక్టరేట్ రోడ్డులో, అటవీశాఖ కార్యాలయాన్ని తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఏర్పాటు చేయనున్నారు.