: మహిళా దొంగ నుంచి భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం
సామాజిక సేవే లక్ష్యంగా వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ హైదరాబాద్‌లో నగలు, విలువైన వస్తువులు కాజేస్తోన్న ఓ మహిళా దొంగ పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పోలీసులు మహిళా దొంగను ఈరోజు అరెస్టు చేశారు. లేడీ కిలాడీ 16 చోరీల కేసుల్లో నిందితురాలిగా ఉందని పోలీసులు తెలిపారు. ఆమెనుంచి భారీగా బంగారు ఆభరణాలు, నగదు, ల్యాప్‌టాప్ లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మహిళా దొంగ ఉదంతంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.