: బొర్రా గుహల వద్ద విరిగిన కొండచరియలు... వందల మంది టూరిస్టుల నరకయాతన


భారీ వర్షాల కారణంగా బొర్రా గుహల వద్ద కొండ చరియలు విరిగిపడటంతో అరకు లోయకు టూరిస్టులను తీసుకువెళ్లే కిరండోల్ పాసింజర్ రైలు ఎటూగాని ప్రాంతంలో నిలిచిపోయింది. ప్రస్తుతం చిముడుపల్లి రైల్వే స్టేషనులో ఉదయం నుంచి రైలు ఆగిపోగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విరిగిపడ్డ కొండచరియలను ఇప్పటికిప్పుడు తొలగించే అవకాశాలు కనిపించడం లేదని సమాచారం. దీంతో కేకే లైన్ లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఇంకా ఎటువంటి చర్యలూ చేపట్టలేదని తెలుస్తోంది. రైల్లో నీరు నిండుకుందని, తినేందుకు ఏమీ లభించని చోట రైలు ఆగిపోయిందని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం వేళ, విశాఖ నుంచి బయలుదేరే రైలులో అరకు వెళ్లే వారంతా ప్రయాణిస్తుంటారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News