: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ అంశాన్ని గమనించాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.