: మధురైలో సమంతకు చుక్కలు చూపిన అభిమానులు!


దక్షిణాది బ్యూటీ సమంత, మధురై అభిమానుల అత్యుత్సాహంతో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. 'వీకేర్' అనే కంపెనీ తమ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సమంతను పిలిచి, ఆమె రాక గురించి ముందే పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో భారీ ఎత్తున అభిమానులు వచ్చి, సమంత రాగానే ఆమెను చుట్టుముట్టారు. తొలుత, ఆమెను ఎలాగోలా షోరూములోకి తీసుకువెళ్లగలిగిన సిబ్బంది, తిరిగి బయటున్న కారులోకి ఎక్కించలేకపోయారు. అభిమానులు ఆమె కారుకు పంచర్లు చేశారు. అక్కడి స్పీకర్లు ధ్వంసం చేశారు. దీంతో అతికష్టం మీద తిరిగి షోరూమ్ లోకి తీసుకువెళ్లిన కార్యక్రమ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై పోలీసులు అభిమానులపై లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ పరిణామాలతో కాసేపు ఆందోళన చెందిన సమంత, చివరకు ఎలాగోలా చెన్నై బయలుదేరి వెళ్లింది.

  • Loading...

More Telugu News