: వైభవంగా యదువీర కృష్ణదత్త, త్రిషికా కుమారి వివాహం
మైసూర్ యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ వివాహం, రాజస్థాన్ కు చెందిన దుంగల్ పూర్ రాజ కుటుంబానికి చెందిన రాకుమారి త్రిషికా కుమారితో అంగరంగ వైభవంగా జరిగింది. కొద్దిసేపటి క్రితం అందంగా అలంకరించిన కల్యాణ మండపంపై వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వధూవరులు ఒకటయ్యారు. పలువురు కేంద్రమంత్రులు, వీఐపీలు, కన్నడ సినీ ప్రముఖులు వివాహానికి అతిథులుగా వచ్చారు. కల్యాణ మండపం అలంకరణలో మైసూరు రాజవంశీకుల సంప్రదాయం గండభేరుండం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైసూర్ యువరాజు వివాహ వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.