: 'వరల్డ్ నెంబర్ 1' అర్జెంటీనాకు భారీ షాక్... 'కోపా అమెరికా' కప్ చిలీ కైవసం


ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న అర్జెంటీనాకు గట్టి షాక్ తగిలింది. 'కోపా అమెరికా' కప్ ఫైనల్లో అర్జెంటీనాను చిలీ చిత్తు చేసింది. తొలుత 90 నిమిషాలు, ఆపై అదనపు సమయం కలిపి 120 నిమిషాల పాటు ఆట సాగినప్పటికీ, ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యం కాగా, 4 - 2 తేడాతో చిలీ గెలిచి, రెండేళ్లలో రెండో కోపా అమెరికా టైటిల్ ను ఎగరేసుకుపోయింది. అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ పెనాల్టీని గోల్ గా మలచడంలో విఫలం కావడం ఓటమిని ఖరారు చేసింది. ఈ విజయంతో చిలీ సంబరాలు చేసుకుంటుండగా, అర్జెంటీనా ఆటగాళ్లు తీవ్ర నిరాశలో పడిపోయారు.

  • Loading...

More Telugu News