: సన్ రైజర్స్ కు వాట్సన్ పోటు
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు మరో పరాభవం తప్పలేదు. జైపూర్లో నేటి సాయంత్రం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ సామి (60) చలవతో 9 వికెట్లకు 144 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయభేరి మోగించింది. ఓపెనర్ గా బరిలో దిగిన షేన్ వాట్సన్ కేవలం 53 బంతుల్లో 98 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. వాట్సన్ స్కోరులో 13 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి.