: 2019లోనూ కేంద్రంలో బీజేపీదే అధికారం!... రాజస్ధాన్ సీఎం వసుంధర జోస్యం!


కేంద్రంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి మెజారిటీతో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అగ్రరాజ్యం అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు తమ సందేశాల్లో మోదీని ఆకాశానికెత్తేశాయి. ఇదంతా జరిగి ఇప్పటికే రెండేళ్లవుతోంది. మరో మూడేళ్లలో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నిన్న ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే కీలక వ్యాఖ్య చేశారు. 2019లోనూ కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆమె జోస్యం చెప్పారు. రాజస్ధాన్ లో కూడా 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీనే విజయం వరిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా తాను విస్తృతంగా పర్యటించనున్నానని చెప్పిన ఆమె పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ‘ఆప్ కీ జిల్లా... ఆప్ కీ సర్కార్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వసుంధర తెలిపారు.

  • Loading...

More Telugu News