: 'ఇక ఉద్యోగానికి రాజీనామా చేయరా' అని దాసరిగారు చెప్పడంతో చేసేశా!: బాబూమోహన్


‘ఉద్యోగానికి రిజైన్ చేయరా, ఇంకొకడన్నా బతుకుతాడు.. అని దాసరి గారు చెప్పడంతో నా ఉద్యోగానికి రాజీనామా చేశాను’ అని ప్రముఖ నటుడు బాబూమోహన్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తన సినిమా కెరీర్ కి సంబంధించిన జ్ఞాపకాలను ఆయన పంచుకున్నారు. ‘అంకుశం’ చిత్రం తర్వాత పది సినిమాల్లో తనకు అవకాశాలు వచ్చాయని, ఇక వెనక్కి తిరిగి చూడలేదని చెప్పారు. ‘‘మామగారు సినిమా వరకు కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. రేపు ఏమవుతుందో తెలియదు. అందుకే, ఐదేళ్లు లీవ్ పెట్టి సినిమాల్లో నటించాను. ఒకసారి, దాసరి గారు ‘ ఏరా, ఉద్యోగం ఏమి చేశావు?’ అన్నారు. 'గురువు గారు లీవ్ పెట్టినా'నన్నాను. ‘ఎప్పటికీ లీవేనా?’ అని ఆయన అంటే ‘లీవే’ అని చెప్పాను. ‘నువ్వు ఫుడ్ రిజర్వ్ లో పెట్టుకున్నావు రా. మామగారు సినిమాతో నువ్వు స్టార్ వి అయిపోయావురా, వెనక్కి చూసుకునే పని లేదురా. ఆ ఉద్యోగానికి రిజైన్ చేయరా, ఇంకొకడన్నా బతుకుతాడు’ అని ఆయన అంటే.. ఇక అప్పుడు నా ఉద్యోగానికి రిజైన్ చేశాను’ అని బాబూమోహన్ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News