: ముగిసిన రేవంత్ రెడ్డి రెండు రోజుల దీక్ష... కేసీఆర్ పై విమర్శలు!


మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్ లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేపట్టిన రెండు రోజుల దీక్ష ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, మల్లన్నసాగర్ పై నీటిపారుదల రంగ నిపుణుల సూచనలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మెదక్ కలెక్టర్ రాజకీయ నాయకుడిలా మారారని, స్థానిక ఎమ్మెల్యేకి, మంత్రికి గానీ ముంపు గ్రామాలకు వచ్చే దమ్ములేదని అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా నిలుస్తుందని రేవంత్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News