: నాగం, రేవంత్ లిద్దరూ తోడుదొంగలే!: మంత్రి జూపల్లి


బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి లిద్దరూ తోడుదొంగలేనని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే వారికి మనుగడ ఉండదని భావించి తమకు అడ్డుపడుతున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై నాగం జనార్దన్ రెడ్డికి హైకోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు 2004 నుంచి ఇప్పటివరకు భూ సేకరణ జరగలేదన్నారు. భూ సేకరణ కారణంగానే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయన్నారు. 2013 చట్టంతో రైతులకు నష్టమేనని, ఈ విషయం వాస్తవం కాకుంటే పదకొండేళ్లుగా వివిధ ప్రాజెక్టులకు భూ సేకరణ ఎందుకు చేపట్టలేదని జూపల్లి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News