: కేసీఆర్ ను ఎవరూ కాపాడలేరు: టీడీపీ నేత రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తామని, జనంలోకి లాగుతామని, ఆయన్ను ఇక ఎవరూ కాపాడలేరని టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ నిర్వాసితులకు మద్దతుగా ఏటిగడ్డ కిష్టాపూర్ లో తన రెండో రోజు దీక్ష సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ఏటిగడ్డ కిష్టాపూర్ కు వచ్చి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన సొంత జిల్లాలోని ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని, కేసీఆర్ తన ఫాంహౌస్ లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే సరిపోదని విమర్శించారు.