: ‘క్రూ కట్’ హెయిర్ స్టైల్ లో కోహ్లీ ఇలా ఉన్నాడు!
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ వెరైటీ హెయిర్ స్టైల్స్ ను అనుసరిస్తుండటం తెలిసిందే. తాజాగా, క్రూ కట్ హెయిర్ స్టైల్ లో ఉన్న కోహ్లీ తన ఫొటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వచ్చే నెల 21 నుంచి వెస్టిండీస్ తో జరగనున్న టెస్టు సిరీస్ లో భారత్ తలపడనుంది. జులై 9న భారత్ జట్టు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను వెస్టిండీస్ లో ఆడుతుంది. ఈ టూర్ కు క్రూకట్ హెయిర్ స్టైల్ లోనే కోహ్లీ వెళ్లనున్నట్లు సమాచారం.