: అదంతా రహస్యం, నేనేమీ మాట్లాడను: రవిశాస్త్రి ఆరోపణలపై గంగూలీ


భారత క్రికెట్ జట్టుకు కోచ్ కావాలని ఆశపడి, కేవలం బ్యాటింగ్ కోచ్ గా మాత్రమే సరిపెట్టుకున్న రవిశాస్త్రి, గంగూలీపై కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను ఇంటర్వ్యూ చేసినప్పుడు గంగూలీ లేడని రవిశాస్త్రి వ్యాఖ్యానించగా, వీటిపై గంగూలీ స్పందించాడు. ఇంటర్వ్యూ ప్రక్రియంతా రహస్యమని, రవిశాస్త్రి మాటలపై తానేమీ చెప్పబోనని అన్నాడు. గత మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఆయన్ను ఇంటర్వ్యూ చేశారని అన్నాడు. క్యాబ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఉన్న తాను ఆపై సచిన్, లక్ష్మణ్ లను కలిశానని వివరించాడు. కాగా, గంగూలీ, సచిన్, లక్ష్మణ్ లు జట్టుగా ఏర్పడి, అనిల్ కుంబ్లేను జట్టు కోచ్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News