: రికార్డులు బద్దలు కొడుతున్న ఇండియా... మోదీ తాజా 'మనసులో మాట'
ఇటీవలి కాలంలో ఇండియా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మన్ కీ బాత్ లో భాగంగా ఆకాశవాణి ద్వారా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇస్రో సైంటిస్టులు ఒకేసారి 20 ఉపగ్రహాలను దిగ్విజయంగా అంతరిక్షంలోకి చేర్చారని, ఈ విజయంతో పాత రికార్డులు బద్దలయ్యాయని అన్నారు. భారత వాయుసేనలో చిన్న పట్టణాల నుంచి వచ్చిన ముగ్గురు పైలట్లు యుద్ధ విమానాలను నడిపించే స్థాయికి ఎదిగారని గుర్తు చేసుకున్నారు. భారత వాయుసేనలో మహిళా ఫైటర్ పైలట్లు చేరడమూ రికార్డేనని అన్నారు. యోగా గురించి ప్రపంచానికి పరిచయం చేసిన ఇండియా, రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుందని, ఇండియాను ఎన్నో దేశాలు ఫాలో అవుతున్నాయని అన్నారు.