: రూపాయి ఖర్చు లేకుండా దేశాలు తిరుగుతున్న 'డేటింగ్' భామ!


ఒక ఊరి నుంచి మరో ఊరికి పోయిరావాలంటేనే వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వుంటుంది. అదే ఇక మరో దేశానికి వెళ్లి ఖరీదైన హోటళ్లలో ఉండి, విమానాల్లో తిరుగుతూ, షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేయాలంటే... లక్షలు ఖర్చయిపోతాయి. కానీ, 30 సంవత్సరాల నటాలీ వుడ్ అనే బ్రిటన్ భామ రూపాయి ఖర్చు చేయకుండా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతోంది. ఎలాగంటారా? పోయిన ప్రతి చోటా 'మిస్ ట్రావెల్' డేటింగ్ వెబ్ సైట్ లో ఓ ధనవంతుడిని తోడుగా చేసుకుంటూ ఉండటమే. ఇప్పటివరకూ టర్కీ, అబూదాబీ, దుబాయ్, కువైట్, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాలు తిరిగిన నటాలీ ప్రస్తుతం మియామీలో ఉంది. తాను ఇప్పటివరకూ 80 మందితో డేటింగ్ చేశానని, దేశాలన్నీ తిరిగి రావాలన్న కోరికతో పాటు ఓ మంచి భర్తను వెతుక్కోవడమే తన లక్ష్యమని చెబుతోంది. తన డేటింగ్ టూర్ ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, సంపన్న పురుషులు తన అందానికి ఇట్టే పడిపోతున్నారని, ఇక వారితో స్వల్పకాల లైంగిక బంధం తనకు ఇబ్బందేమీ కావడం లేదని చెబుతోంది. ఇప్పటివరకూ దాదాపు కోటి రూపాయలకు పైగా తన కోసం డేటింగ్ ఫ్రెండ్స్ ఖర్చు చేసి వుండవచ్చని నటాలీ అంది. కువైట్ లో ఓ ఇంటర్నేషనల్ అకౌంటెంట్, ఆస్ట్రేలియాలో ఎన్నో సొంత విమానాలున్న బిలియనీర్ ను కలవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. మియామీలో తనను కలవాల్సిన వ్యాపారవేత్త, పనిమీద లండన్ వెళ్లిపోయాడని, ఇక్కడి నుంచి మరో దేశం వెళ్లేందుకు 'మిస్ ట్రావెల్' సైట్ ను వెతుకుతున్నానని చెబుతోందీ ముద్దుగుమ్మ.

  • Loading...

More Telugu News