: రజనీకాంత్ అనారోగ్యానికి కారణం ఆయన సోదరుడేనంటూ తమిళనాట పోస్టర్ల కలకలం!
ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యానికి గురి కావడానికి ఆయన సోదరుడు సత్యనారాయణ కారణమని రజనీ అభిమానులు పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తుండటం కలకలం రేపింది. మధురై జిల్లా రజనీ అభిమానుల సంఘం వీటిని ముద్రించింది. కొచ్చాడియాన్, లింగా సినిమాలు పరాజయం కావడానికి కూడా సత్యనారాయణ కారణమని అభిమానులు ఆరోపించారు. ఆయన వైఖరితోనే రజనీ మనస్తాపానికి గురయ్యారని పేర్కొన్నారు. కాగా, ఈ పోస్టర్ల వ్యవహారంపై మధురై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.