: భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న సీమాంధ్ర!
ఓ వైపు రుతుపవనాలు, మరోవైపు విస్తరించిన అల్పపీడనంతో సీమాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలకు తడిసిముద్దవుతున్నాయి. విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 6 నుంచి 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు నగరాల్లోని పలు లోతట్టు కాలనీల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, హైదరాబాద్ లో గత రాత్రి కురిసిన వర్షానికి సికింద్రాబాద్ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మూడడుగుల లోతు నీరు చేరడంలో ట్రాఫిక్ స్తంభించింది.