: కేసీఆర్ ను తిట్టినందుకు జూబ్లీహిల్స్ పీఎస్ లో రేవంత్ పై కేసు


ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని రేవంత్ నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడని, 'గాడిద కొడుకు' అని అన్నాడని టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి హైదరాబాదు జూబ్సీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, రేవంత్ మాట్లాడిన టేపులను పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న అనంతరం కేసుపై ఎలా ముందడుగు వేయాలన్నది నిర్ణయిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, మల్లన్న సాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా మాట్లాడిన రేవంత్, కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News