: ఆప్ ఎమ్మెల్యే దినేశ్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు


ఢిల్లీలో ఈరోజు పోలీసులు అరెస్టు చేసిన ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మొహానియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను అక్కడి న్యాయస్థానం నిరాకరించింది. దినేశ్ ను సోమవారం వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడంతో ఆయన్ని తీహార్ జైలుకు తరలించారు. కాగా, నీటి సరఫరా సక్రమంగా లేదని ఫిర్యాదు చేసేందుకు రెండు రోజుల దినేశ్ కార్యాలయానికి వెళ్లిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని, ఒక మహిళను బయటకు తోసేశారని ఆరోపిస్తూ బాధితురాలు సదరు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News