: కోడెలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోతే మేమే ఫిర్యాదు చేస్తాం: అంబటి రాంబాబు
గత ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని సత్తెనపల్లి ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని.. దీనిని ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోకపోతే తామే రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని ఎదురుచూస్తున్నామని, మరో రెండు రోజులు వేచి చూస్తామన్నారు. అలా జరగకపోతే రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని, దీనికీ ఎన్నికల కమిషన్ స్పందించకపోతే న్యాయపరంగా తమ పార్టీ తరపున పోరాడతామని చెప్పారు.