: ఎమ్మెల్యే, మలయాళ నటుడు ముఖేశ్ కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
సీపీఎం ఎమ్మెల్యే, మలయాళ నటుడు ముఖేశ్ కనబడటం లేదంటూ కొల్లాం నియోజకవర్గ ప్రజలు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన తమ నియోజకవర్గానికి వచ్చిన దాఖలాలు లేవని, వెంటనే చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, రిసీట్ కూడా ఇచ్చారు. కాగా, ముఖేశ్ పై మిస్సింగ్ కేసు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ, పొరపాటున కేసు నమోదు చేశారని అన్నారు. ఈ విషయమై ముఖేశ్ స్పందిస్తూ, తాను ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని చెప్పారు.