: స్మార్ట్ సిటీల పనుల ప్రారంభోత్సవం కొత్త చరిత్రకు నాంది పలుకుతుంది: వెంకయ్య
ప్రజలందరూ దేశ అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని పుణెలో ఈరోజు ఆకర్షణీయ నగరాలకు ప్రధాని మోదీ పనుల ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ప్రతీ మంచి మార్పు పుణెలోనే ప్రారంభమవుతోందని అందుకే ఆ నగరాన్ని స్మార్ట్ సిటీ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంచుకున్నామని పేర్కొన్నారు. ఈరోజు పుణెలో ప్రారంభమవుతోన్న స్మార్ట్ సిటీల పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. కొత్త చరిత్రకు నాంది అని ఆయన అన్నారు.