: ‘హోదా’తో అందే దాని కంటే ఎక్కువ లాభాల్నే చేకూర్చాం: ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సిద్ధార్థనాథ్

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ బలపడుతుందని, పుంజుకుంటోన్న తమ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ సిద్దార్థనాథ్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అందించాల్సిన ప్రయోజనాలను బీజేపీ సమకూరుస్తూనే ఉందని అన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్ర ప్రజలకు అందాల్సిన దాని కంటే తాము ఎక్కువ లాభాన్నే చేకూర్చామని ఆయన చెప్పారు. బీజేపీ కేవలం రెండేళ్ల పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీజేపీ ప్రజల మెప్పుపొందుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ బలపడుతుందని పేర్కొన్నారు.