: ప్రధాని మోదీ ఢిల్లీలో ఎమర్జెన్సీ ప్రకటించారు: సీఎం కేజ్రీవాల్ సెటైర్


ఢిల్లీలో మీడియా సమావేశం జరుగుతుండగానే ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహనియాను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లడంపై సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ రాజధాని ఢిల్లీలో ‘ఎమర్జెన్సీ’ని ప్రకటించారంటూ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఎన్నికైన వారిని అరెస్టులు చేయడం, భయపెట్టడం, వారిపై దాడులు చేయడంతో పాటు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారంటూ కేజ్రీవాల్ విమర్శించారు. కాగా, దినేశ్ మోహనియా ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. నీటి కొరతపై వినతిపత్రం ఇచ్చేందుకని నిన్న ఆయన కార్యాలయానికి ఒక వృద్ధుడితో పాటు పలువురు మహిళలు అక్కడికి వెళ్లారు. అయితే, వారితో ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించడమే కాకుండా వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News